e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home టాప్ స్టోరీస్ అక్ష‌ర్‌.. ఆ స‌న్‌గ్లాసెస్ ఎక్క‌డ దొరుకుతాయ్ ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌

అక్ష‌ర్‌.. ఆ స‌న్‌గ్లాసెస్ ఎక్క‌డ దొరుకుతాయ్ ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌

అక్ష‌ర్‌.. ఆ స‌న్‌గ్లాసెస్ ఎక్క‌డ దొరుకుతాయ్ ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌

ఇంగ్లాండ్‌పై టెస్ట్ సిరీస్ గెలిచి ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌కు చేరిన‌ టీమిండియాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. శ‌నివారం ఇంగ్లాండ్‌తో జ‌రిగిన నాలుగో టెస్ట్‌లో అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్ మాయాజాలాన్ని క్రికెట్ అభిమానులు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తు‌తున్నారు. దేశ‌మంతా టీమిండియా ఆట‌తీరును.. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్ గురించి ప్ర‌శంసిస్తూ ట్వీట్లు చేస్తుంటే.. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా క‌ళ్లు మాత్రం అక్ష‌ర్ ప‌టేల్ పెట్టుకున్న స‌న్ గ్లాసెస్ మీద ప‌డ్డాయి. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఆనంద్ మ‌హీంద్రా టీమిండియాకు శుభాకాంక్ష‌లు చెబుతూనే.. త‌న‌దైన శైలిలో ట్వీట్ చేశాడు. టీమిండియా విక్ట‌రీని సెల‌బ్రేట్ చేసుకునేందుకు అక్ష‌ర్ ప‌టేల్ పెట్టుకున్న స‌న్ గ్లాసెస్ కావాల‌ని కోరాడు.

‘దుమ్ములేపి.. సిరీస్‌ను మీ జేబులో వేసుకున్నారు. అభినంద‌న‌లు.. ఈ విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకునేందుకు నాకు ఆ స‌న్ గ్లాసెస్ కావాలి. అవి ఏ బ్రాండ్ స‌న్ గ్లాసెస్‌.. అవి ఎక్క‌డ దొరుకుతాయి’ చెప్పండి అంటూ ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేశారు.

Advertisement
అక్ష‌ర్‌.. ఆ స‌న్‌గ్లాసెస్ ఎక్క‌డ దొరుకుతాయ్ ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement