ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Jul 28, 2020 , 15:01:37

అనుష్క నన్ను మార్చేసింది: భార్యపై కోహ్లీ ప్రశంసలు

అనుష్క నన్ను మార్చేసింది: భార్యపై కోహ్లీ ప్రశంసలు

న్యూఢిల్లీ: జీవిత భాగస్వామిగా అనుష్క శర్మ దొరకడం తన అదృష్టమని టీమ్​ఇండియా కెప్టెన్  విరాట్ కోహ్లీ అన్నాడు. నిరంతరం మంచి కోసం తపన పడే వ్యక్తిగా అనుష్క తనను మార్చిందని విరాట్ చెప్పాడు. అది తన క్రికెట్​ కెరీర్​తో పాటు జీవితానికి ఎంతో సాయం చేసిందంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.  భారత టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్​ చేసిన ఇంటర్వ్యూలో అనుష్క గురించిన విరాట్ కోహ్లీ మాట్లాడిన వీడియోను బీసీసీఐ మంగళవారం ట్విట్టర్​లో పోస్ట్ చేసింది.  విరాట్, బాలీవుడ్ నటి అనుష్క శర్మ 2017 డిసెంబర్​లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె గురించి కోహ్లీ చాలాసార్లు గొప్పగా చెప్పాడు. తాజాగా మరోసారి తన మనోగతాన్ని పంచుకున్నాడు.

“అన్ని విషయాల్లో విభిన్న కోణాన్ని కూడా చూసేలా నేను మారానంటే అందుకు పూర్తి క్రెడిట్  ఆమెకే(అనుష్క)కే దక్కుతుంది. ఆమె నా జీవిత భాగస్వామిగా రావడం నా అదృష్టం. మేం ఇద్దరం ఒకరి నుంచి ఒకరం చాలా నేర్చుకుంటాం. అనుష్క రాక ముందు నేను ఎక్కువగా భావాలు వ్యక్తం చేసేవాడిని కాదు. ప్రాక్టీకల్​గా ఆలోచించేవాడిని కాదు. కొన్ని విషయాల్లో ఆమె నా ధృక్కోణాన్ని మార్చింది. నా మైండ్​సెట్ కూడా మారింది. అంతకు ముందు కొన్ని విషయాలను పూర్తిగా అర్థం చేసుకునే వాడిని కాదు. అయితే చాలా విషయాలను విశాల దృక్పథంతో చూడాలని ఆమె నాకు అర్థమయ్యేలా చేసింది. సరైన రీతిలో ప్రజలకు ఉదాహరణగా ఉండడం, అన్ని విషయాలను అర్థం చేసుకోవడం.. అనుష్కతో ఉండడం వల్లే నాకు వచ్చాయి. అందుకు నేనెప్పుడూ ఆమెకు ఫుల్ క్రెడిట్ ఇస్తా. చుట్టూ ఉండే మనుషులను, పరిస్థితులను అనుష్క బాగా అర్థం చేసుకుంటుంది’ అని విరాట్ కోహ్లీ అన్నాడు. 


logo