బుధవారం 12 ఆగస్టు 2020
Sports - Jul 13, 2020 , 13:16:02

అమితాబ్‌, అభిషేక్‌ త్వరగా కోలుకోవాలి.. ప్రముఖుల ట్వీట్‌

అమితాబ్‌, అభిషేక్‌ త్వరగా కోలుకోవాలి.. ప్రముఖుల ట్వీట్‌

ముంబై : బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌, అతడి కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే వారు త్వరగా కోలుకోవాలని చాలా మంది నటీనటులు, క్రీడా ప్రముఖులు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. తాజాగా అమితాబ్‌, అభిషేక్‌ కరోనా నుంచి తొందరగా కోలుకోవాలని పలువురు క్రికెటర్లు ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు.

‘టేక్‌ కేర్‌.. అమిత్‌ జీ.. ‘మీరు, అభిషేక్‌ త్వరగా కోలుకోవాలని, మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. ‘సార్‌ అమితాబ్‌ గారు మీరు వేగంగా కోలుకోవాలి’ అని హర్భజన్‌, ‘సోదరా అభిషేక్‌ నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని యువరాజ్‌ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo