టోక్యో: ఒలింపిక్స్( Tokyo Olympics )లో వరల్డ్ రికార్డులు క్రియేట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా 400 మీటర్ల హర్డిల్స్‌లో అమెరికన్ స్ప్రింటర్ సిడ్నీ మెక్‌లాలిన్ తన సొంత రికార్డును బద్ధలు కొట్టింది. 51.46 సెకన్లలో రేసు పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించింది. గతంలో మెక్లాలినే 51.90 సెకన్లతో క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డు ఇప్పుడు చెదిరిపోయింది. మరో అమెరికన్ ముహమ్మద్ దలీలా 51.58 సెకన్లలో పూర్తి చేసి సిల్వర్ గెలుచుకుంది. నెదర్లాండ్స్‌కు చెందిన ఫెమ్కే బోల్ యురోపియన్ రికార్డు టైమ్ 52.03 సెకన్లతో బ్రాంజ్ మెడల్ గెలిచింది.