బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sports - Feb 18, 2021 , 16:22:35

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఫైన‌ల్లోకి జెన్నిఫ‌ర్ బ్రాడీ

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఫైన‌ల్లోకి జెన్నిఫ‌ర్ బ్రాడీ

మెల్‌బోర్న్‌:  ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ మ‌హిళ‌ల సింగిల్స్‌ ఫైన‌ల్లో జెన్నిఫ‌ర్ బ్రాడీ ఎంట‌రైంది.  అమెరికా టెన్నిస్ సంచ‌ల‌నం బ్రాడీ.. గ్రాండ్‌స్లామ్ ఫైన‌ల్లో ప్ర‌వేశించ‌డం ఇదే తొలిసారి.   సెమీస్ మ్యాచ్‌లో 6-4, 3-6, 6-4 స్కోర్ తేడాతో క‌రోలినా ముచోవ్‌పై జెన్నిఫ‌ర్ విజ‌యం సాధించింది.  ఫైన‌ల్లో జ‌పాన్ ప్లేయ‌ర్ ఒసాకాతో బ్రాడీ త‌ల‌ప‌నున్న‌ది.  22వ సీడెడ్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగిన జెన్నిఫ‌ర్‌..  25వ సీడ్ ముచోవాపై మూడు సెట్ల‌లో మ్యాచ్‌ను కైవ‌సం చేసుకున్న‌ది.  సెరీనాతో జ‌రిగిన మ్యాచ్‌లో గెలిచిన ఓసాకాతో ఫైన‌ల్లో బ్రాడీ త‌ల‌ప‌డ‌నున్న‌ది. 


VIDEOS

logo