ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 16, 2020 , 00:29:43

ఆంధ్రాకు అంబటి రాయుడు!

ఆంధ్రాకు అంబటి రాయుడు!

న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్‌లో ఆంధ్రా జట్టు తరఫున ఆడేందుకు భారత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు సిద్ధమయ్యాడు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)తో తీవ్ర విభేదాల కారణంగా గతేడాది జట్టును వీడగా.. ఆంధ్రాకు వెళ్లేందుకు బీసీసీఐ అతడికి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) ఇచ్చినట్టు బోర్డు అధికారి ఒకరు చెప్పారు. కరోనా వైరస్‌ విజృంభణ తర్వాత బీసీసీఐ నిర్వహించనున్న తొలి దేశవాశీ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆంధ్రా తరఫున రాయుడు బరిలోకి దిగనున్నట్టు సమాచారం. మరో రెండు రోజుల్లో ఆంధ్రా క్రికెట్‌ సంఘం ఈ విషయంపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. 

ఛత్తీస్‌గఢ్‌కు రవికిరణ్‌  

హెచ్‌సీఏ నుంచి ప్లేయర్ల వలసల పరంపర కొనసాగుతున్నది. పేసర్‌ మాజేటి రవి కిరణ్‌ ఛత్తీస్‌గఢ్‌ తరఫున బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్‌ జట్టులో కీలక బౌలరైన రవికిరణ్‌ రానున్న సీజన్‌లో ఛత్తీస్‌గఢ్‌కు సేవలు అందించనున్నాడు.  


logo