సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Sep 12, 2020 , 00:42:08

రైనా స్థానంలో రాయుడు బెటర్‌: ైస్టెరిస్‌

రైనా స్థానంలో రాయుడు బెటర్‌: ైస్టెరిస్‌

న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కు దూరమైన సురేశ్‌ రైనా బ్యాటింగ్‌ చేసే మూడో స్థానంలో అంబటి రాయుడును బ్యాటింగ్‌కు దింపితే బాగుంటుందని న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్కాట్‌ ైస్టెరిస్‌ అన్నాడు. కీలకమైన మూడో ప్లేస్‌లో రైనాకు బదులుగా రాయుడు సరిగ్గా సరిపోతాడని ైస్టెరిస్‌ చెప్పుకొచ్చాడు. ఈ నెల 19న జరిగే తమ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను చెన్నై ఎదుర్కొబోతున్నది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు కూర్పుపై కివీస్‌ క్రికెటర్‌ ఓ టెలివిజన్‌ షోలో మాట్లాడుతూ ‘రైనా గైర్హాజరీ ఒక రకంగా చెన్నైకి పూడ్చలేని లోటు. అనుభవజ్ఞుడైన రైనాను భర్తీ చేయడం అంత సులువు కాదు. అటు టాపార్డర్‌, మిడిలార్డర్‌ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచే మూడో స్థానంలో రైనా స్థానంలో రాయుడు వస్తే చాలా నయం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. రైనా కేవలం బ్యాట్స్‌మన్‌గానే కాదు ఉపయుక్తమైన బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ రాణించగల సత్తా అతని సొంతం. అయినా సీఎస్‌కేకు చాలా ఆప్షన్లు ఉన్నాయి’ అని అన్నాడు. 


logo