శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sports - Sep 23, 2020 , 17:28:36

చెన్నైకి షాక్..రాయుడు దూరం!

 చెన్నైకి షాక్..రాయుడు దూరం!

దుబాయ్;ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభమై వారం రోజుల గడవకముందే గాయాల బారిన పడుతున్న ఆటగాళ్ల సంఖ్య పెరుగుతున్నది.  తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడుకు తొడ కండరాలు పట్టేయడంతో మరో రెండు మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకుంటున్నాడు.  ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో  అంబటి రాయుడు (71:  48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో చెలరేగి జట్టుకు విజయాన్నందించాడు.

అదే మ్యాచ్‌లో అతడి కండరాలు పట్టేయడంతో రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లోనూ అతడు ఆడలేదు. రాయుడు 100శాతం ఫిట్‌నెస్‌ సాధించలేదని రాజస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ధోనీ వెల్లడించిన విషయం తెలిసిందే.  సన్‌రైజర్స్‌ కీలక ఆటగాడు   కేన్‌ విలియమ్సన్‌‌కు కూడా కండరాలు పట్టేశాయి.  బెంగళూరుతో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ పాల్గొనలేదు. గాయం కారణంగా ఆ జట్టు  ఆటగాడు  మిచెల్‌ మార్ష్‌  సీజన్‌ నుంచి వైదొలిగాడు.logo