మంగళవారం 19 జనవరి 2021
Sports - Dec 26, 2020 , 04:27:21

ఆంధ్ర కెప్టెన్‌గా అంబటి

ఆంధ్ర కెప్టెన్‌గా అంబటి

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో బరిలోకి దిగే ఆంధ్ర జట్టుకు అంబటి రాయుడు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వచ్చే నెల 10న మొదలకానున్న టోర్నీ కోసం ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) శుక్రవారం జట్టును ప్రకటించింది. వికెట్‌కీపర్‌ కేఎస్‌ భరత్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉంటే లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ లలిత్‌ మోహన్‌..రాయుడును అనుసరిస్తూ హైదరాబాద్‌ జట్టును వీడాడు. నిలకడగా రాణిస్తున్నా..హెచ్‌సీఏ సెలెక్టర్ల కరుణ దక్కకపోవడంతో లలిత్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తాజాగా ప్రకటించిన ఆంధ్ర జట్టులో మోహన్‌కు చోటు లభించింది.