మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Aug 07, 2020 , 11:02:59

ఐపీఎల్‌ స్పాన్సర్‌ రేసులో బైజూస్, జియో, అమెజాన్‌

ఐపీఎల్‌ స్పాన్సర్‌   రేసులో బైజూస్, జియో, అమెజాన్‌

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌కు వివో అధికారికంగా దూరమవడంతో బీసీసీఐ మరో స్పాన్సర్‌ కోసం త్వరలోనే టెండర్లను పిలవనుంది. ఈ నేపథ్యంలో బైజూస్‌, జియో, అమెజాన్‌, అన్‌అకాడమీ, డ్రీమ్‌ 11, మైసర్కిల్‌ 11 తదితర కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.  ‘బైజూస్‌’  సంస్థ ఇప్పటికే భారత క్రికెట్‌ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్‌లో సగం జట్లకు అసోసియేట్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న  ‘జియో’ కూడా  ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తున్నది.

దసరా(అక్టోబర్‌), దీపావళి(నవంబర్‌) నెలల్లో భారత్‌లో ఫెస్టివల్‌ సీజన్‌ కావడంతో   అత్యంత ప్రజాదరణ ఉన్న ఐపీఎల్‌తో  అనుబంధం పెంచుకునేందుకు ఇది సరైన సమయమని ‘అమెజాన్‌’ కూడా భావిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్‌తో గట్టిపోటీ ఎదురవుతున్న నేపథ్యంలో  భారత మార్కెట్లో మరింత బలపడాలని అమెజాన్‌ యోచిస్తోంది.

మరోవైపు స్పాన్సర్‌షిప్‌ హక్కుల కోసం మరో రెండు కంపెనీలు అన్‌అకాడమీ, మైసర్కిల్‌11, డ్రీమ్‌ 11 పోటీపడుతున్నాయి. ఐపీఎల్‌లో స్పాన్సర్‌షిప్‌ కోసం శీతలపానీయాల కంపెనీ కోకా కోలా రేసులో ఉన్నది.  


logo