గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 08, 2020 , 13:46:43

IND vs AUS: మెల్‌బోర్న్‌ హౌస్‌ఫుల్‌..వీడియోలు

IND vs AUS: మెల్‌బోర్న్‌ హౌస్‌ఫుల్‌..వీడియోలు

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ పోరులో ఆతిథ్య ఆస్ట్రేలియా బ్యాటర్‌ అలీసా హీలీ పరుగుల వరద పారించింది. అలవోకగా సిక్సర్లు బాదుతూ భారత బౌలర్లకు చుక్కలు చూపించింది. గైక్వాడ్‌ వేసిన 8వ ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టిన హీలీ..శిఖా పాండే వేసిన 11వ ఓవర్లో ఏకంగా వరుసగా 3 సిక్సర్లు బాది ఆకట్టుకుంది. 

ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు ఉన్న ఎమ్‌సీజీలో జరుగుతున్న  ఫైనల్‌ మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి  అనూహ్య స్పందన లభించింది.  ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. స్టేడియంలోని స్టాండ్స్‌ అన్నీ క్రికెట్‌  ప్రేమికులతో దాదాపుగా నిండిపోవడం విశేషం. ఫైనల్‌ మ్యాచ్‌ ఆరంభానికి ముందు అట్టహాసంగా నిర్వహించిన వేడుకలు ఆకట్టుకున్నాయి. 
logo
>>>>>>