గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Mar 08, 2020 , 12:44:54

INDvAUS: హీలీ హాఫ్‌సెంచరీ..టీ20ల్లో 2వేల పరుగులు

INDvAUS: హీలీ హాఫ్‌సెంచరీ..టీ20ల్లో 2వేల పరుగులు

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌-2020 ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా అమ్మాయిల జట్టు దూకుడుగా ఆడుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ బ్యాటర్లు పవర్‌ప్లేలో  49 రన్స్‌ రాబట్టి  జట్టుకు శుభారంభం అందించారు.  మెల్‌బోర్న్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తుండటంతో ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌  అలీసా హీలీ అలవోకగా బౌండరీలు బాదుతోంది. 

భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్న హీలీ  కేవలం 30 బంతుల్లోనే అర్దశతకం పూర్తి చేసుకుంది. గైక్వాడ్‌ వేసిన 8వ ఓవర్లో ఏకంగా రెండు సిక్సర్లు బాది 16 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో హీలీ 2వేల పరుగుల మైలురాయిని అందుకుంది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్‌ నష్టపోకుండా 91 పరుగులు చేసింది. హీలీ(57) హిట్టింగ్‌ చేస్తుండగా బెత్‌ మూనీ(32) ఆచితూచి ఆడుతోంది. logo