బుధవారం 03 మార్చి 2021
Sports - Jan 29, 2021 , 13:10:44

ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముగ్గురూ భార‌త అంపైర్లే

ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముగ్గురూ భార‌త అంపైర్లే

చెన్నై: ఇండియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో అంపైరింగ్ బాధ్య‌త‌ల‌ను ఐసీసీ ప్యానెల్లోని ముగ్గురు భార‌త అంపైర్లే నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో ఇద్ద‌రు అంపైర్లు టెస్టుల్లో తొలిసారి అంపైరింగ్ చేయనుండ‌టం విశేషం. ఐసీసీ ఎమిరేట్స్ ప్యానెల్‌లో ఉన్న‌ వీరేంద‌ర్ శ‌ర్మ‌, అనిల్ చౌద‌రి తొలిసారి టెస్టుల్లో అంపైరింగ్ చేయ‌నున్నారు. వీళ్ల‌కు ఇండియా ఎలైట్ ప్యానెల్లో ఉన్న అంపైర్ నితిన్ మీన‌న్ కూడా జ‌త క‌ల‌వ‌నున్నాడు. నితిన్‌కు గ‌తంలో టెస్టు మ్యాచ్‌లో అంపైరింగ్ చేసిన అనుభవం ఉంది. కొవిడ్ కార‌ణంగా ప్ర‌యాణ స‌మ‌స్య‌లు ఉండ‌టంతో వ‌రల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌సిప్‌లో స్థానిక అంపైర్ల‌నే నియ‌మించే అవ‌కాశం ఐసీసీ క‌ల్పించింది. 

దీని కార‌ణంగానే ఇప్పుడు భార‌త అంపైర్ల‌కు ఊహించ‌ని అవ‌కాశం ద‌క్కింది. నిజానికి ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో భార‌త్ నుంచి ఒకే అంపైర్ ఉన్నారు. ఇండియా, ఇంగ్లండ్ సిరీస్ అంపైర్ల‌లో నితిన్ మీన‌నే సీనియ‌ర్‌. అత‌డు మూడు టెస్టులు, 24 వ‌న్డేలు, 16 టీ20ల్లో అంపైరింగ్ చేశాడు. అటు వీరేంద‌ర్ శ‌ర్మ కేవ‌లం రెండు వ‌న్డేలు, ఒక టీ20లోనే అంపైరింగ్ చేయ‌గా.. చౌద‌రి 20 వ‌న్డేలు, 28 టీ20ల్లో అంపైరింగ్ చేశాడు. 

VIDEOS

logo