శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 25, 2020 , 11:52:54

అన్ని శిక్షణ కేంద్రాలు బంద్: కిరణ్​​ రిజిజు

అన్ని శిక్షణ కేంద్రాలు బంద్: కిరణ్​​ రిజిజు

21రోజుల దేశవ్యాప్త లాక్​డౌన్ సమయంలో అన్ని క్రీడా శిక్షణ శిబిరాలు, కేంద్రాలు మూతపడే ఉంటాయని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అథ్లెట్లు ఇండ్లలోనే ఉండి శారీరక, మానసిక ఫిట్​నెస్​ను మెరుగుపరుచుకునేందుకు కృషి చేయాలని సూచించారు.

‘ప్రభుత్వ సూచనల మేరకు 21రోజుల లాక్​డౌన్ కాలంలో అన్ని క్రీడా శిక్షణ కేంద్రాలు, శిబిరాలు మూతపడే ఉంటాయి. అథ్లెట్లు ఉన్న చోటనే.. శారీరక, మానసిక ఫిట్​నెట్​ను మెరుగుపరుచుకునేందుకు కృషి చేయండి. బయటకు మాత్రం రావొద్దు’ అని కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. సాయ్ పరిధిలోని అన్ని శిక్షణ కేంద్రాలు, శిబిరాలను ఇప్పటికే ఈ నెల 31వరకు బంద్ చేయగా, తాజా లాక్​డౌన్​తో మరింత కాలం కొనసాగనుంది. కాగా, కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21రోజుల పాటు లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అలాగే టోక్యో ఒలింపిక్స్​ను ఏడాది వాయిదా వేయడాన్ని రిజిజు స్వాగతించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. అథ్లెట్ల క్షేమం కోసం అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ(ఐవోసీ) తీసుకున్న నిర్ణయం మంచిదేనని అభిప్రాయపడ్డారు. విశ్వక్రీడల వాయిదాతో అథ్లెట్లు ఏ మాత్రం నిరాశ చెందాల్సిన అవసరం లేదని, వచ్చే ఏడాది మంచి అవకాశాలు దక్కుతాయని ధైర్యం చెప్పారు. అలాగే 2021లో భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన చేసి ఎక్కువ పతకాలు సాధిస్తారని కేంద్ర మంత్రి రిజిజు ఆశాభావం వ్యక్తం చేశారు. 

కరోనాపై పోరు: రొనాల్డో సాయం


logo