శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 07, 2020 , 11:51:26

ఫ్లైట్‌ మిస్సయ్యాడు..టోర్నీకి దూరమయ్యాడు!

ఫ్లైట్‌ మిస్సయ్యాడు..టోర్నీకి దూరమయ్యాడు!

బార్బడోస్‌: వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఫాబియన్‌ అలెన్‌ కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)కు దూరమయ్యాడు. సీపీఎల్‌లో పాల్గొనేందుకు అలెన్‌ జమైకా నుంచి బార్బడోస్‌  వెళ్లాల్సి ఉంది.  సకాలంలో విమానాశ్రయానికి   చేరుకోలేకపోవడంతో అతడు  ఫ్లైట్‌ మిస్సయ్యాడు. సీపీఎల్‌ 2020 సీజన్‌లో సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ తరఫున ఆడాల్సి ఉంది. 

ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం  చార్టర్‌ విమానాలలో తప్ప ఎవరు దేశంలోకి ప్రవేశించడం లేదా నిష్క్రమించడానికి అనుమతి లేదు. దీంతో ఆల్‌రౌండర్‌ ఇక టోర్నమెంట్‌లో పాల్గొనలేడు. అతని స్థానంలో జట్టులోకి ఇంకెవరినీ తీసుకోలేదు. ఆగస్టు 18 నుంచి సీపీఎల్‌ లీగ్‌  ఆరంభంకానుంది. సెప్టెంబర్‌ 10న ఫైనల్‌ జరుగుతుంది. టోర్నీ మొత్తం ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోలోని రెండు స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే జరుగుతుంది. 
logo