శనివారం 31 అక్టోబర్ 2020
Sports - Sep 21, 2020 , 17:58:44

SRH vs RCB: అందరి చూపులు ఈ ఇద్దరిపైనే..!

SRH vs RCB: అందరి చూపులు ఈ ఇద్దరిపైనే..!

దుబాయ్‌:  ఐపీఎల్‌-13వ సీజన్‌లో మరో ఆసక్తికర సమరం రాత్రి 7.30గంటలకు ఆరంభంకానుంది.  మూడో మ్యాచ్‌లో భాగంగా రాయల్‌  ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సోమవారం జరిగే పోరులో  విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి.  

నిలకడైన ప్రదర్శనతో ఆడిన ఏడు సీజన్లలో రైజర్స్‌ ఐదుసార్లు ప్లేఆఫ్స్‌ చేరింది.  అందులో ఓసారి చాంపియన్‌గా మరోసారి రన్నరప్‌గా  నిలిచిన హైదరాబాద్‌.. యూఏఈ గడ్డపై దుమ్మురేపేందుకు సిద్ధమైంది.  డేవిడ్‌ వార్నర్‌ కెప్టెన్సీలోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సమతూకంతో  కనిపిస్తోంది. 

ఐపీఎల్‌ సీజన్‌ మొదలవుతుందంటే చాలు బెంగళూరు అభిమానుల హడావుడి మామూలుగా ఉండదు. ‘ఈ సలా కప్పు నమదే’ (ఈ సారి కప్పు మనదే) అంటూ నానా హంగామా చేస్తారు. ప్రతిసారి లాగే ఈ ఏడాది కూడా బెంగళూరు బలమైన జట్టుతో లీగ్‌కు సిద్ధమైంది.   పన్నెండేండ్లుగా పోరాడుతున్నా.. ఒకటికి మూడుసార్లు (2009, 2011, 2016) ఫైనల్‌ చేరినా.. టైటిల్‌ మాత్రం కొట్టలేకపోయిన రాయల్‌ చాలెంజర్స్‌.. ఈ సారి మరింత జోరు పెంచేందుకు రెడీ అయింది.

విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని   బెంగళూరు జట్టు హార్డ్‌హిట్టర్‌ డివిలియర్స్‌, పింఛ్‌పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నది.  అటు వార్నర్‌..ఇటు కోహ్లీ ఇద్దరు కూడా ఒంటిచేత్తో మ్యాచ్‌ను  మలుపు తిప్పుతారు. వీరిద్దరి  బ్యాటింగ్‌  విన్యాసాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.