శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Sep 12, 2020 , 14:00:24

అమెరికా క్రికెటర్‌ తొలిసారి ఐపీఎల్‌లో..

అమెరికా క్రికెటర్‌ తొలిసారి ఐపీఎల్‌లో..

దుబాయ్‌:  ఇండియన్‌  ప్రీమియర్ లీగ్‌(ఐపీఎల్‌)లో ఆడనున్న మొదటి  అమెరికా క్రికెటర్‌గా  అలీ ఖాన్‌ రికార్డు  సృష్టించనున్నాడు. సీమర్‌ హ్యారీ గుర్నీ స్థానంలో అలీ ఖాన్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టులోకి తీసుకున్నది.  అమెరికా నుంచి ఐపీఎల్‌లో పాల్గొనబోతున్న తొలి ఆటగాడిగా 29ఏండ్ల ఖాన్‌ అరుదైన ఘనత అందుకోనున్నాడు.  భుజం గాయం కారణంగా గత నెలలో ఇంగ్లాండ్‌ టీ20 లీగ్‌ విటాలిటీ బ్లాస్ట్‌తో పాటు ఐపీఎల్‌ నుంచి వైదొలిగాడు.  తాజాగా గుర్నీని ఖాన్‌ భర్తీ చేస్తున్నాడు. 

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌) 2020 విజేతగా నిలిచిన ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టుకు అలీ ఖాన్‌ ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల ముగిసిన సీపీఎల్‌లో ఉత్తమ బౌలర్లలో ఒకడిగా అతడు నిలిచాడు. 7.43 ఎకానమీ రేటుతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.  దినేశ్‌ కార్తీక్‌ నాయకత్వంలోని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ ఫ్రాంఛైజీ సహయజమానిగా బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ వ్యవహరిస్తున్నారు. 


logo