టోక్యో : వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్, టాప్ సీడ్ నోవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు ఒలింపిక్స్‌లో షాక్ తగిలింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జొకో 6-1, 3-6, 1-6 తేడాతో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో గోల్డెన్‌స్లామ్ సాధించి చరిత్ర సృష్టించాలని భావించిన అతడి ఆశలు గల్లంతయ్యాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ నెగ్గిన ఈ సెర్బియా స్టార్.. ఒలింపిక్స్‌తో పాటు యూఎస్ ఓపెన్ కూడా గెలిచి గోల్డెన్ స్లామ్ సాధించాలని భావించాడు. ఈ క్రమంలో సెమీస్ పోరులో జొకో స్పీడ్‌కు జ్వెరెవ్ బ్రేక్ వేశాడు. 1988లో స్టెఫీగ్రాఫ్ మాత్రమే ఇంతవరకు ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు పుటలకెక్కింది. ఫైనల్లో రష్యా ఆటగాడు కరెన్ ఖచనోవ్‌తో జ్వెరెవ్ తలపడనున్నాడు.