సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Aug 11, 2020 , 23:12:22

గంగూలీ గ్రేట్ కెప్టెన్‌: అక్త‌ర్‌

గంగూలీ గ్రేట్ కెప్టెన్‌: అక్త‌ర్‌

న్యూఢిల్లీ:  తానాడిన వాళ్ల‌లో టీమ్ఇండియా కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ గొప్ప సార‌థి అని పాకిస్థాన్ మాజీ పేస‌ర్ షోయ‌బ్ అక్త‌ర్ అన్నాడు. భార‌త ఆట‌గాళ్ల‌పై త‌ర‌చూ నోరు పారేసుకునే అక్త‌ర్ దాదా కెప్టెన్సీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. దాదా గొప్ప కెప్టెన్ మాత్ర‌మే కాదు.. అంత‌క‌న్నా గొప్ప ప్ర‌త్య‌ర్థి అని అన్నాడు. గ‌తంలో భార‌త్‌, పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్ సంద‌ర్భంగా గంగూలీతో క‌లిసి దిగిన ఫొటోనూ ఇన్‌స్టాగ్రామ్‌ను పోస్ట్ చేశాడు. 

`ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా నేను చాలా ఉత్సాహంగా ఉండేవాడిని. ఎందుకంటే పోరులో ప్ర‌త్య‌ర్థిపై పైచేయి సాధించ‌డం అంటే నాకు ఇష్టం. నేను ఎదుర్కొన్న క‌ఠిన ప్ర‌త్య‌ర్థుల్లో సౌర‌వ్ గంగూలీ ఒక‌డు. అత‌డు గొప్ప కెప్టెన్ కూడా. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో భాగంగా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ ట్టు త‌ర‌ఫున గంగూలీ సార‌థ్యంలో ఆడా`అని అక్త‌ర్ రాసుకొచ్చాడు.


logo