బాహుబలి 2 తర్వాత అనివార్య కారణాలతో నాలుగేళ్ళ పాటు బ్రేక్ తీసుకున్నాడు రానా దగ్గుబాటి. ఈయన నుంచి ఇప్పుడు వచ్చిన తాజా చిత్రం అరణ్య. ప్రభు సాల్మాన్ తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగులో పాటు తమిళం, హిందీలోనూ ఒకేరోజు విడుదలైంది. దీనికి అన్నిచోట్లా కూడా టాక్ పెద్దగా రాలేదు. మంచి సినిమా కానీ స్క్రీన్ ప్లే బాగోలేదు.. ఎడిటింగ్ చాలా వీక్ గా ఉంది.. సీన్స్ మధ్య కనెక్టివిటీ కూడా లేదంటూ పెదవి విరిచారు ప్రేక్షకులు. దాంతో అది వసూళ్లపై కూడా ప్రభావం చూపించింది. 16 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రం తెలుగులో ఎంత షేర్ వసూలు చేసిందో చూద్దాం..
నైజాం- 0.44 కోట్లు
సీడెడ్- 0.18 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.19 కోట్లు
ఈస్ట్- 0.09 కోట్లు
వెస్ట్- 0.10 కోట్లు
గుంటూరు- 0.23 కోట్లు
కృష్ణా- 0.09 కోట్లు
నెల్లూరు- 0.06 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 1.38 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 0.61 కోట్లు
ఓవర్సీస్- 0.10 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 2.09 కోట్లు
‘అరణ్య’ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఈ సినిమాకు ముందు 25 కోట్ల లక్ష్యం ఉండేది. కానీ నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 9 కోట్ల వరకూ వచ్చేసాయి. దాంతో 16 కోట్లు రావాలి. అంత చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. తొలిరోజు ఈ చిత్రం 2.09 కోట్ల షేర్ వచ్చింది కాబట్టి బ్రేక్ ఈవెన్ కావాలంటే 13.91 కోట్ల షేర్ వసూలు చేయాలి.