గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Apr 17, 2020 ,

పోరాడి ఓడిన అఖిల్‌

 పోరాడి ఓడిన అఖిల్‌


కరీంనగర్‌ స్పోర్ట్స్‌: గువాహటి వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆకట్టుకుంటున్నారు. గురువారం జరిగిన అండర్‌-17 గ్రీకో-రోమన్‌ విభాగంలో కరీంనగర్‌కు చెందిన కొర్ర అఖిల్‌ తృటి లో కాంస్య పతకం చేజార్చుకున్నాడు. రెపిచేజ్‌ రౌండ్‌లో భాగంగా తొలుత అసోం రెజ్లర్‌ అన్సులాపై గెలిచిన అఖిల్‌...ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రద్యుమన్‌ చేతిలో ఓడిపోయాడు. వాస్తవానికి అఖిల్‌ గెలిచినట్లు కనిపించినా..రిఫరీ పక్షపాత నిర్ణయంతో పతకం చేజార్చుకోవాల్సి వచ్చింది. మరోవైపు శుక్రవారం జరిగే బాలికల ఫ్రీైస్టెల్‌ విభాగం లో రాజేశ్వరి(53కి), శ్రీవాణి(46కి), సింధూజ పోటీపడుతున్నట్లు రాష్ట్ర రెజ్లింగ్‌ కోచ్‌ అశోక్‌ కుమార్‌, అసోసియేషన్‌ కార్యదర్శి నర్సింగ్‌ రావు తెలిపారు. 


logo