బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 03, 2020 , 00:38:38

కుటుంబం వెంట లేకున్నా ఓకే: రహానే

కుటుంబం వెంట లేకున్నా ఓకే: రహానే

న్యూఢిల్లీ: యూఏఈలో జరిగే ఐపీఎల్‌ కోసం ఆటగాళ్ల వెంట కుటుంబ సభ్యులను అనుమతించకపోయినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ అజింక్యా రహానే అన్నాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో అందరి ఆరోగ్యమే ప్రధానమని ఆదివారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘ఎక్కడికైనా కుటుంబంతో వెళ్లేందుకే ఇష్టపడతాం. కానీ ప్రస్తుతం పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఇప్పుడున్న స్థితిలో క్రికెట్‌ కన్నా ఆరోగ్యమే ప్రథమమని నా అభిప్రాయం. అయితే యూఏఈలో ఐపీఎల్‌ ఆడే ఆటగాళ్ల వెంట కుటుంబాలను అనుమతించే విషయంపై బీసీసీఐ, ఫ్రాంచైజీలే తుది నిర్ణ యం తీసుకోవాలి’ అని రహానే చెప్పాడు. 


logo