గురువారం 04 మార్చి 2021
Sports - Jan 17, 2021 , 07:45:06

కష్టాల్లో భారత్‌.. కెప్టెన్‌ రహానే ఔట్‌

కష్టాల్లో భారత్‌.. కెప్టెన్‌ రహానే ఔట్‌

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌ కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే ఛటేశ్వర్‌ పుజారా వికెట్‌ను కోల్పోయిన టీమిండియా, 39 పరుగుల తేడాతో కెప్టెన్‌ రహానే కూడా పెవీలియన్‌కు చేరాడు. ఆసిస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ విసిరిన బంతి రహానే బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకున్నది. నేరుగా నాలుగో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మ్యాథ్యూ వేడ్‌ చేతిలో పడింది. దీంతో 93 బంతుల్లో 37 పరుగులు చేసిన రహానే జట్టు స్కోరు 144 రన్స్‌ వద్ద నాలుగో వికెట్‌గా వెనుతిరిగాడు. అనంతరం రిషబ్‌ పంత్‌ క్రీజులోకి వచ్చాడు. అంతకుముందు 25 పరుగులు చేసిన పుజారా 105 స్కోర్‌ వద్ద ఔట్‌ అయ్యాడు. ప్రస్తుతం మయాంక్‌ అగర్వాల్‌ 38 (73), రిషబ్‌ పంత్‌ 4 (12) బ్యాటింగ్‌ చేస్తున్నారు. దీంతో లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. మరో 208 పరుగులు చేయాల్సి ఉన్నది.


VIDEOS

logo