గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 22, 2020 , 16:04:47

టెస్టుల్లో రహానె తొలిసారి ఇలా..

టెస్టుల్లో రహానె తొలిసారి ఇలా..

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 165 పరుగులకే కుప్పకూలింది.

వెల్లింగ్టన్‌:  న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో   ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ ఆజింక్య రహానె, రిషబ్‌ పంత్‌ కివీస్‌ బౌలర్లను  సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. బ్యాటింగ్‌ చేయడానికి కష్టంగా ఉన్న పిచ్‌పై పంత్‌ కుదురుకునేందుకు ప్రయత్నించగా.. రహానె(46: 138 బంతుల్లో 5ఫోర్లు) అర్ధశతకం దిశగా ముందుకు సాగుతున్నాడు. ఈ జోడీ ఏకంగా ఆరో వికెట్‌కు  103 బంతులను ఎదుర్కోవడం విశేషం. అనూహ్యంగా పంత్‌(19 53 బంతుల్లో 1ఫోర్‌, సిక్స్‌) రనౌట్‌ కావడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం ఆతిథ్య బౌలర్ల దెబ్బకు భారత్‌ కేవలం మరో 33 పరుగులు మాత్రమే చేసి ఆఖరి ఐదు వికెట్లు చేజార్చుకుంది.  తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 165 పరుగులకే కుప్పకూలింది. 

శనివారం ఉదయం ఆటలో భారత్‌ ఇన్నింగ్స్‌ 59వ ఓవర్ వేసేందుకు ఫాస్ట్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ బంతి అందుకున్నాడు. రహానె పాయింట్‌ దిశగా బంతిని బాది సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. అప్పటికే బంతి పీల్డర్‌ అజాజ్‌ పటేల్‌ చేతిలో పడింది. అయినా కూడా రహానె నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు పరుగెత్తాడు. ఇక చేసేదేమీలేక స్టైకింగ్‌ ఎండ్‌వైపు పంత్‌ పరుగుతీశాడు. అప్పటికే  ఫీల్డర్‌  విసిరిన బంతి   స్టంప్స్‌కు తాకడంతో పంత్‌ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. 2013 నుంచి టెస్టులు ఆడుతున్న రహానె  తన కెరీర్‌లో ఓ రనౌట్‌లో భాగస్వామ్యం కావడం ఇదే తొలిసారి.  రహానె  అనవసర పరుగు కోసం ప్రయత్నించడం వల్లే పంత్‌ వికెట్‌ను భారత్‌ చేజార్చుకుందని సోషల్‌మీడియాలో అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు.logo
>>>>>>