బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sports - Feb 03, 2021 , 15:13:41

బ్యాక్‌ టు ట్రైనింగ్‌..నెట్స్‌లో రహానె: వీడియో

బ్యాక్‌ టు ట్రైనింగ్‌..నెట్స్‌లో రహానె: వీడియో

చెన్నై: ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి టెస్టు సిరీస్‌ గెలిచిన టీమ్‌ఇండియా సొంతగడ్డపై మరో కీలక పోరుకు సన్నద్ధమవుతోంది.  ఫిబ్రవరి 5 నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య తొలి టెస్టు చెన్నై వేదికగా ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లు చెపాక్‌ స్టేడియంలో సాధన చేస్తున్నాయి.  ఆరు రోజుల క్వారంటైన్‌ అనంతరం కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో సోమవారమే ఔట్‌డోర్‌ సెషన్‌కు దిగిన భారత ఆటగాళ్లు.. మంగళవారం తొలి నెట్‌ సెషన్‌లో చెమటోడ్చారు. 

ఆసీస్‌ పర్యటనలో చివరి మూడు టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించిన రహానె నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. నెట్స్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో బ్యాటింగ్‌ సాధన చేస్తుండగా తీసిన వీడియోను రహానె సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. 

VIDEOS

logo