రహానే అర్ధ సెంచరీ.. పటిష్ట స్థితిలో భారత్

మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ పట్టు బిగిస్తుంది. జట్టు స్కోరు 36 పరుగుల వద్ద రెండోరోజు ఆటను ప్రారంభించిన భారత్ టీ విరామం సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 189పరుగులు చేసింది. అజింక్యా రహానే (53) అర్ధ సెంచరీ చేయడంతో టీ మిండియా పటిష్ట స్థితిలో ఉంది. అంతకముందు చతేశ్వర్ పుజారా (17: 70 బంతుల్లో 1X4).. ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ టిమ్ పైనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న శుభమన్ గిల్ (45: 65 బంతుల్లో 8x4) కూడా అదే తరహాలో కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటవడం విశేషం.
ఇక కుదురుకుంటున్న సమయంలో హనుమ విహారి(21), రిషబ్ పంత్( 28) అనవసరపు షాట్ ఆడి వికెట్ సమర్పించుకున్నారు. ప్రస్తుతం క్రీజులో రహానేతో పాటు జడేజా( 4) ఉన్నారు. మరో 6 పరుగులు చేస్తే టీమిండియా ఆసీస్ స్కోర్‌కి సమం అవుతుంది. ఆసీస్ బౌలర్స్‌లో కమిన్స్ 2, స్టార్క్ 2, కమిన్స్ ఓ వికెట్ తీసుకున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కన్నా అదనంగా 50 పరుగులు చేస్తే మ్యాచ్‌పై పట్టు బిగించే అవకాశం ఉంది.
తాజావార్తలు
- కొత్త వేరియంట్లో లెక్సస్ ఫ్లాగ్షిప్ సెడాన్
- సత్వరమే సమస్యలు పరిష్కరించాలి
- కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్
- గ్రాజియా స్పోర్ట్స్ ఎడిషన్
- రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
- ఐస్లాండ్ అమ్మాయి- గొల్లపల్లి అబ్బాయి
- ఆల్‌ది బెస్ట్ చిల్డ్రన్
- మారుతి కార్లు ప్రియం
- మృత్యువులోనూ వీడని స్నేహం
- ట్రాఫిక్ వయోలేషన్ ప్రీమియం