శుక్రవారం 03 జూలై 2020
Sports - May 17, 2020 , 23:30:49

అర్జునకు అంకిత, శరణ్‌

అర్జునకు అంకిత, శరణ్‌

  • ప్రతిపాదించిన ఐటా 

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న అంకిత రైనా, దివిజ్‌ శరణ్‌ల పేర్ల ను అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) ప్రతిష్టాత్మక క్రీడాపురస్కారం అర్జున అవార్డుకు ప్రతిపాదించింది. డేవిస్‌ కప్‌ కోచ్‌ నందన్‌ బాల్‌ పేరును ద్రోణాచార్య కోసం పంపింది. మహిళల టెన్నిస్‌లో భారత నం బర్‌వన్‌గా కొనసాగుతున్న అంకిత.. 2018 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకుంది. ఫెడ్‌కప్‌లో భారత జట్టు తొలిసారి వరల్డ్‌ గ్రూప్‌ ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించడంలోనూ అంకిత కీలక పాత్ర పోషించింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్నతో కలిసి ఆసియా క్రీడల స్వర్ణం నెగ్గిన దివిజ్‌ శరణ్‌.. ప్రస్తుతం డబుల్స్‌లో భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు.


logo