సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 21, 2020 , 01:06:09

అహ్మదాబాద్‌లో గులాబీ టెస్ట్‌: దాదా

అహ్మదాబాద్‌లో గులాబీ టెస్ట్‌: దాదా

కోల్‌కతా: వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌లో పర్యటించనున్న ఇంగ్లండ్‌ జట్టు అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియం (ప్రపంచంలోనే అతి పెద్దది)లో గులాబీ టెస్టు ఆడుతుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మంగళవారం పేర్కొన్నాడు. ఇంగ్లిష్‌ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత్‌ రానుంది. ఈ పర్యటనలో భాగంగా డే అండ్‌ నైట్‌ టెస్టుకు అహ్మదాబాద్‌ ఆతిథ్యమివ్వనున్నట్లు దాదా తెలిపాడు. మంగళవారం ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దాదా ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. ప్రస్తుతానికైతే ప్రణాళికలు వేశాం. ఇంగ్లండ్‌ టూర్‌ గురించి ఆలోచించడానికి ముందు ఆసీస్‌ పర్యటనపై దృష్టి పెట్టాలి’ అని అన్నాడు.