శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 25, 2020 , 17:35:39

IPL 13: 'ఖేల్‌ భోలేగా' క్యాంపెయిన్‌ను ప్రారంభించిన స్టార్‌స్పోర్ట్స్‌

IPL 13: 'ఖేల్‌ భోలేగా' క్యాంపెయిన్‌ను ప్రారంభించిన స్టార్‌స్పోర్ట్స్‌

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌) 13వ సీజన్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్‌ షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఖరారు చేసిన విషయం తెలిసిందే.   గత సీజన్లతో పోలిస్తే..  ఈ ఏడాది ఐపీఎల్ మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  భారత ఉప ఖండంలో ఐపీఎల్ ప్రసార హక్కులను   స్టార్  టీవీ దక్కించుకుంది.  స్టార్‌ స్పోర్ట్స్‌కు చెందిన  ఛానెళ్లలో  పలు ప్రాంతీయ భాషల్లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లు  ప్రసారం కానున్నాయి.  

లీగ్‌ ఆరంభానికి ముందే క్రికెట్‌ అభిమానుల్లో ధనాధన్‌ టోర్నీ అంచనాలను భారీగా పెంచేందుకు స్టార్‌స్పోర్ట్స్‌ ప్రచార కార్యక్రమాలను మొదలెట్టింది. తాజాగా ఖేల్‌ భోలేగా(ఆటే మాట్లాడుతుంది) పేరుతో బీసీసీఐతో కలిసి క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఖేల్‌ భోలేగా పేరుతో రూపొందించిన వీడియోను అన్ని ఫ్రాంతీయ భాషల్లో విడుదల చేయగా ఫ్యాన్స్‌ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఐపీఎల్‌-13 సీజన్‌ మార్చి 29 నుంచి ఆరంభంకానుంది.
logo