గురువారం 02 జూలై 2020
Sports - Apr 19, 2020 , 14:00:00

మూడు నెల‌ల త‌ర్వాత వుహాన్‌కు సాకర్ టీమ్‌

మూడు నెల‌ల త‌ర్వాత వుహాన్‌కు సాకర్ టీమ్‌

మూడు నెల‌ల త‌ర్వాత వుహాన్‌కు సాకర్ టీమ్‌

షాంఘై: ప‌్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ పుట్టుకకు కేంద్ర‌మైన వుహాన్‌కు మూడు నెల‌ల త‌ర్వాత సాకర్ టీమ్ చేరుకుంది. చైనీస్ సూప‌ర్ లీగ్(సీఎస్ఎల్‌)కు చెందిన వుహాన్ ఝ‌ల్ జ‌ట్టు శ‌నివారం త‌మ స్వ‌స్థ‌లంపై అడుగుపెట్టింది. గ్వాంగ్జు నుంచి వుహాన్‌కు స్పీడ్ ట్రైన్‌లో వ‌చ్చిన వుహాన్ ఝ‌ల్ టీమ్‌కు అభిమానులు ఘ‌న స్వాగతం ప‌లికారు. 

మాస్క్‌లు ధ‌రించిన ఆట‌గాళ్ల‌కు పూల బొకేల‌తో వెల్‌క‌మ్ చెప్పారు. జోస్ గొంజాలెజ్ సార‌థ్యంలోని వుహాన్ ఝ‌ల్ జ‌ట్టులోని స్థానిక ఆట‌గాళ్లు కొద్ది రోజుల పాటు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుపనున్నారు. వీరంతా దాదాపు మూడు నెలల‌కు పైగా కుటుంబాల‌తో దూరంగా ఉన్నారు. వాస్త‌వానికి వుహాన్‌లో వైర‌స్ వ్యాప్తి చెందే స‌మ‌యానికి జ‌న‌వ‌రి ఆఖ‌రి వారంలో ఝ‌ల్ టీమ్ ఆట‌గాళ్లంతా స్పెయిన్‌కు వెళ్లారు. అయితే అక్క‌డ కూడా వైర‌స్ అంత‌కంత‌కు వ్యాప్తి చెంద‌డంతో జ‌ట్టు యాజ‌మాన్యం చైనాకు బ‌యలుదేరేందుకు ఏర్పాట్లు చేసింది. గ‌త నెల 16న వీరంతా చైనాలోని షెంజెన్ న‌గ‌రానికి చేరుకున్నారు. మూడు వారాల‌ క్వారంటైన్ త‌ర్వాత శ‌నివారం ఇక్క‌డ‌కు చేరుకున్నారు. బుధ‌వారం నుంచి ప్రాక్టీస్ సెష‌న్ మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు జ‌ట్టు వ‌ర్గాలు పేర్కొన్నాయి. 


logo