బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 16, 2020 , 16:37:52

ENGvPAK:తొలి ఓవర్‌లోనే ఇంగ్లాండ్‌కు షాక్‌

ENGvPAK:తొలి ఓవర్‌లోనే ఇంగ్లాండ్‌కు షాక్‌

సౌతాంప్టన్‌: పాకిస్థాన్‌తో రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టుకు   ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో పాక్‌ బౌలర్‌ షాషీన్‌ అఫ్రిదీ ఇంగ్లాండ్‌కు షాకిచ్చాడు. నాలుగో బంతికి ఓపెనర్‌  రోరీ బర్న్స్‌ను ఔట్‌ చేసిన అఫ్రిదీ పాక్‌ శిబిరంలో ఉత్సాహం నింపాడు. మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బర్న్స్‌ను బోల్తా కొట్టించాడు. నాలుగు బంతులాడిన బర్న్స్‌ డకౌట్‌ కావడంతో నిరాశగా పెవిలియన్‌ చేరాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు ఆడిన  ఇంగ్లాండ్‌ వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది. జాక్‌ క్రాలీ(5), డొమినిక్‌ సిబ్లే(2) క్రీజులో ఉన్నారు.  అంతకుముందు ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో పాక్‌ 91.2 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. 


logo