బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 06, 2020 , 12:44:22

ఆఫ్ఘ‌న్ క్రికెట‌ర్‌ న‌జీబ్ మృతి

ఆఫ్ఘ‌న్ క్రికెట‌ర్‌ న‌జీబ్ మృతి


హైద‌రాబాద్‌:  రోడ్డు ప్ర‌మాదం వ‌ల్ల కోమాలోకి వెళ్లిన‌ ఆఫ్ఘ‌నిస్తాన్ జాతీయ క్రికెట‌ర్‌, డ్యాషింగ్ ఓపెన‌ర్ న‌జీబ్ తారాకాయి ఇవాళ తుదిశ్వాస విడిచాడు. నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్ర‌మాదంలో న‌జీబ్‌కు తీవ్ర గాయాల‌య్యాయి.  29 ఏళ్ల న‌జీబ్ అప్ప‌టి నుంచి కోమాలోనే ఉన్నాడు.  ఈస్ట్ర‌న్ నాన్‌ఘ‌ర్ ప్రావిన్సులో రోడ్డు దాటుతున్న స‌మ‌యంలో ఓ కారు ఆయ‌న్ను ఢీకొట్టింది.  త‌ల‌కు బ‌ల‌మైన  గాయాలు అయిన న‌జీబ్‌.. మృతిచెందిన‌ట్లు ఇవాళ ఆఫ్ఘ‌నిస్తాన్ క్రికెట్ బోర్డు త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్న‌ది. ఆఫ్ఘ‌నిస్తాన్ త‌ర‌పున ఒక టీ20, 12 వ‌న్డేల్లో న‌జీబ్ ఆడాడు.  ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన న‌జీబ్‌.. 2017లో ఐర్లాండ్‌తో జ‌రిగిన టీ20లో 90 ర‌న్స్ చేశాడు.   ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో న‌జీబ్ యావ‌రేజ్ 47.20గా ఉంది.  అత్య‌ధికంగా డ‌బుల్ సెంచ‌రీ చేశాడు.  ఆరు సెంచ‌రీలు కూడా చేశాడ‌త‌ను.