సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Aug 01, 2020 , 21:49:23

వన్డేల్లో 150 వికెట్లు తీసిన ఇంగ్లాండ్‌ తొలి స్పిన్నర్‌గా ఆదిల్‌ రషీద్‌ రికార్డు

వన్డేల్లో 150 వికెట్లు తీసిన ఇంగ్లాండ్‌ తొలి స్పిన్నర్‌గా ఆదిల్‌ రషీద్‌ రికార్డు

సౌతాంప్టన్‌:  వన్డే క్రికెట్‌లో 150 వికెట్లు తీసిన తొలి ఇంగ్లండ్ స్పిన్నర్‌గా ఆదిల్ రషీద్ రికార్డు సాధించాడు. సౌతాంప్టన్‌లోని అగాస్‌ బౌల్‌లో ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. హ్యారీ టెక్టర్‌, లోర్కాన్‌ టక్కర్‌, కెవిన్‌ ఓబ్రియాన్‌ వికెట్లు పడగొట్టి 150 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఇతడు తన 102 వ వన్డేలో ఈ ఫీట్‌ సాధించాడు.

రషీద్‌కు ముందు, గ్రేమ్ స్వాన్ స్పిన్నర్‌గా అత్యధిక వికెట్లు పడగొట్టాడు. అతడు 79 మ్యాచ్‌లు ఆడి, 104 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ తరఫున జేమ్స్ ఆండర్సన్ వన్డేల్లో అత్యధిక వికెట్లు (269) సాధించాడు. అండర్సన్ తర్వాత డారెన్ గోఫ్ (234), స్టువర్ట్ బ్రాడ్ (178), ఆండ్రూ ఫ్లింటాఫ్ (168) ఉన్నారు. వారి తర్వాతి స్థానాల్లో రషీద్‌ ఉన్నాడు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo