సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Sep 01, 2020 , 11:19:16

కోహ్లీ టీమ్‌లోకి ఆసీస్‌ లెగ్‌స్పిన్నర్‌

కోహ్లీ టీమ్‌లోకి ఆసీస్‌ లెగ్‌స్పిన్నర్‌

దుబాయ్‌: విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టులోకి ఆస్ట్రేలియా లెగ్‌స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా వచ్చేస్తున్నాడు.  ఆసీస్‌ క్రికెటర్‌ కేన్‌ రిచర్డ్‌సన్‌ స్థానంలో జంపాను ఎంపిక చేశారు. తన భార్య త్వరలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో కేన్‌ ఈ ఏడాది సీజన్‌ నుంచి తప్పుకున్నాడు.  'ఆర్‌సీబీలోకి జంపాను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం. కేన్‌ రిచర్డ్‌సన్‌ స్థానాన్ని అతను భర్తీ చేస్తున్నాడు. లెట్స్‌  ప్లేబోల్డ్‌ ఆడమ్‌ జంపా' అంటూ ఆర్‌సీబీ ట్వీట్‌ చేసింది. 

యుజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మొయిన్‌ అలీ, పవన్‌ నేగీ వంటి స్పిన్నర్లు ఇప్పటికే బెంగళూరు జట్టులో ఉండగా జంపా రాకతో స్పిన్‌ బౌలింగ్‌ దళానికి మరింత బలం చేకూరనుంది.  గొప్ప నైపుణ్యం కలిగిన కేన్‌ ఈ ఏడాది సీజన్‌కు దూరమవడం చాలా నిరాశగా ఉందని ఆర్‌సీబీ టీమ్‌ డైరెక్టర్‌ మైక్‌ హెస్సెన్‌ చెప్పారు. 


logo