ఇస్తాంబుల్: బ్రిటన్ స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) టర్కీ గ్రాండ్ ప్రిలో పోల్ పొజిషన్ సాధించాడు. ప్రధాన రేసుకు ముందు శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో హామిల్టన్ అగ్రస్థానంలో నిలువగా.. 0.13 సెకన్ల తేడాతో మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ హామిల్టన్ కెరీర్లో ఇది 102వ పోల్ పొజిషన్ కాగా.. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.