టోక్యో : పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్‌లో శరత్‌కమల్ ఇంటిదారి పట్టాడు. ఒలింపిక్స్ మూడవ రౌండ్లో అతను చైనా ప్లేయర్ మా లాంగ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. 4-1 తేడాతో లాంగ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి గేమ్‌ను లాంగ్ 11-7 స్కోర్‌తో కైవసం చేసుకున్నాడు. ఇక రౌండవ గేమ్‌లో ఆచంట కమల్ తన దూకుడును ఆటను ప్రదర్శించాడు. అద్భుతమైన రీతిలో 11-8 తేడాతో ఆ గేమ్‌ను కమల్ గెలుచుకున్నాడు. కానీ మళ్లీ వరుసగా మూడు గేమ్‌లలో ఆచంట సరైన ఆటను ప్రదర్శించలేకపోయాడు. నిన్న రెండవ రౌండ్లో పోర్చుగల్ ఆటగాడిపై అద్భుతమైన రీతిలో ఆడిన కమల్ ఇవాళ తన ఆటతీరుతో నిరాశపరిచాడు.