సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Mar 02, 2020 , 00:15:38

ఏసీసీ సమావేశం వాయిదా

 ఏసీసీ సమావేశం వాయిదా

కోల్‌కతా: ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్‌ వేదికను ఖరారు చేసేందుకు దుబాయ్‌లో మంగళవారం జరగాల్సిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) సమావేశం వాయిదా పడింది. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సహా మరికొందరు సభ్యులు సమావేశానికి హాజరయ్యేందుకు నిరాకరించడమే ఇందుకు కారణం. దీంతో ఆసియా కప్‌ వేదిక ఖరారు మరింత ఆలస్యం కానుంది. కొన్ని రోజులుగా దుబాయ్‌లో దాదాపు 700 కరోనా కేసులు నమోదవడంతో ఆందోళన పెరిగింది. ‘ఆదివారం రాత్రే గంగూలీ బయల్దేరాల్సి ఉంది. అయితే దుబాయ్‌లో కరోనా వైరస్‌ ఆందోళన.. సమావేశం వాయిదాకు దారితీసింది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్‌ షెడ్యూల్‌ ప్రకారం పాకిస్థాన్‌లో జరగాల్సి ఉన్నా.. భారత్‌ అభ్యంతరాల నేపథ్యంలో వేదిక మారనుంది.


logo