మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 08, 2020 , 18:05:47

టీ10 లీగ్‌.. తేదీలు ఖరారు !

టీ10 లీగ్‌.. తేదీలు ఖరారు !

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) పదమూడో సీజన్‌ ప్రస్తుతం  షార్జా, అబుదాబి, దుబాయ్‌ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆరంభంలో యూఏఈ వేదికగా అబుదాబి టీ10 క్రికెట్‌ టోర్నమెంట్‌ జరగనుంది.  2021 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6 వరకు లీగ్‌ నిర్వహించనున్నారు. 2019లో నిర్వహించిన ఆరంభ సీజన్‌కు  అనూహ్య స్పందన వచ్చింది. 

టీవీల్లో సుమారు 80 మిలియన్ల మంది ప్రేక్షకులు మ్యాచ్‌లను వీక్షించారు.   కరోనా నేపథ్యంలో లీగ్‌ ఆరంభానికి ముందే ఆటగాళ్లను  యూఏఈ రప్పించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. స్పోర్ట్స్‌ ఛానెల్‌  సోనీ స్పోర్ట్స్ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.   ఐపీఎల్‌-2020   సీజన్‌ బయో బబుల్‌ వాతావరణంలో జరుగుతోంది.  టీ10 లీగ్‌  నిర్వహణలోనూ  కీలకమైన బయో సెక్యూర్‌ బబుల్‌ వాతావరణాన్ని అమలు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు.