శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Sep 01, 2020 , 02:11:38

ఏబీ ప్రాక్టీస్‌ షురూ

ఏబీ ప్రాక్టీస్‌ షురూ

దుబాయ్‌: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. యూఏఈ వేదికగా ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ కోసం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతో కలిసిన ఏబీ.. సుదీర్ఘ విరామం తర్వాత నెట్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. ఆ జట్టు కెప్టెన్‌ కోహ్లీ ప్రాక్టీస్‌ చేసిన మరుసటి రోజు ఏబీ నెట్స్‌లో చెమటోడ్చాడు. ఆ వీడియోను బెంగళూరు ఫ్రాంచైజీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ‘చాలా రోజుల తర్వాత ప్రాక్టీస్‌ ప్రారంభించడం సంతోషంగా ఉంది. నెట్‌ సెషన్‌ చాలా బాగా సాగింది. నా బ్యాటింగ్‌ తీరుతో సంతృప్తికరంగానే ఉన్నా’ అని ఏబీ అందులో పేర్కొన్నాడు. 

    బెంగళూరు కొత్త జెర్సీ..

  ఈ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కొత్త జెర్సీలో కనిపించనుంది. జట్టు సభ్యులు కొత్త జెర్సీతో దిగిన ఫొటోలను ఆ ఫ్రాంచైజీలో సోషల్‌ మీడియాలో పంచుకుంది.


logo