ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 31, 2020 , 14:13:32

నెట్స్‌లో చెమటోడ్చిన ఏబీడీ

నెట్స్‌లో చెమటోడ్చిన ఏబీడీ

ఐసీఎల్‌ 13వ సీజన్‌ వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. బీసీసీఐ నిర్ధేశించిన బయో-సేఫ్ ప్రోటోకాల్‌ను పూర్తి చేసి శిక్షణను ప్రారంభించారు. 

ఆదివారం ఆర్‌సీబీ స్టార్ క్రికెటర్.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ నెట్స్‌లో చెమటోడ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూఏఈలో టోర్నీ ఆడటం గొప్ప సవాలుతో కూడుకున్న పని అని ఏబీడీ అన్నాడు. ‘చాలా కాలం తరువాత ప్రాక్టీస్‌ చేయడం ఆనందదాయకం. లైట్లు కొంచెం అస్పష్టంగా ఉన్నాయి. వికెట్ కొంచెం జిగటగా ఉంది. కాబట్టి ఇక్కడ ఆడటం ఒక సవాలు వంటిది. ఇది చాలాకాలం తర్వాత నా మొదటి నెట్ ప్రాక్టీస్‌.. ’అని డివిలియర్స్ ఆర్‌సీబీ అధికారిక యూట్యూబ్‌ పేజీలో పోస్టు చేసిన వీడియోలో చెప్పాడు. 


‘నేను నా బేసిక్స్ స్థానంలో ఉన్నాను. నేను బంతిని జాగ్రత్తగా చూడాల్సి వచ్చింది. చివర్లో కొన్ని మంచి షాట్లను కొట్టాను. ప్రాక్టీస్‌ చేసే సమయంలో ఎవరికైనా తీవ్రత అవసరం.. నేనూ అదే చేశాను’ అని ఏబీడీ అన్నాడు.  ఇదిలా ఉండగా.. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ, ఆరోన్ ఫించ్ కలిసి ఆర్‌సీబీలో ఓపెనింగ్ చేయబోతున్నారా? అని టీం డైరెక్టర్ మైక్ హెస్సన్‌ను ఇటీవల అడగ్గా.. ‘నాతో సహా అందరూ మ్యాచ్‌ జరిగే వరకు వేచి చాడాల్సిందే’నని హెస్సన్‌ అన్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo