శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 27, 2020 , 16:30:18

బీబీఎల్‌ నుంచి తప్పుకున్న డివిలియర్స్‌

బీబీఎల్‌ నుంచి తప్పుకున్న డివిలియర్స్‌

దుబాయ్: రాబోయే బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌) సీజన్‌ నుంచి  సౌతాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ తప్పుకున్నాడు.  వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏబీడీ చెప్పాడు. భవిష్యత్‌లో మళ్లీ బ్రిస్బేన్‌ హీట్‌ ఫ్రాంఛైజీ తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. 

'త్వరలో నా భార్య డేనియల్‌ మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీనికి మేం ఎంతో సంతోషంగా ఉన్నాం. రాబోయే  కొన్ని నెలలు మాకు ఎంతో ప్రత్యేకం.  ఇప్పుడిప్పుడే మా కుటుంబ ఎదుగుతోంది. కొవిడ్‌-19 ప్రయాణ ఆంక్షలు, ప్రస్తుత పరిస్థితుల వల్ల ఈ ఏడాది సీజన్‌ ఆడకూడదని నిర్ణయించుకున్నానని'  డివిలియర్స్‌ చెప్పాడు. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిలియర్స్‌ ప్రస్తుత యూఏఈలో ఉన్నాడు.