మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 28, 2020 , 18:41:18

డివిలియర్స్‌ ఇంకో 19 పరుగులు చేస్తే...

డివిలియర్స్‌ ఇంకో 19 పరుగులు చేస్తే...

దుబాయ్‌: సౌతాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ మరో అరుదైన  రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిలియర్స్‌ ఈ సీజన్‌లో గొప్పగా రాణిస్తున్నాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న డివిలియర్స్‌ బుధవారం ముంబై ఇండియర్స్‌తో మ్యాచ్‌లో  ఇంకో 19 పరుగులు సాధిస్తే టీ20 క్రికెట్లో 9వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్‌మెన్ల జాబితాలో చోటు దక్కించుకోనున్నాడు. 

ఐపీఎల్‌లో 165 మ్యాచ్‌లాడిన ఏబీడీ 4719 రన్స్‌ చేయగా..అంతర్జాతీయ టీ20ల్లో 1672 పరుగులు సాధించాడు. ముంబైతో కీలక మ్యాచ్‌లో డివిలియర్స్‌ రాణించాలని బెంగళూరు ఆశిస్తోంది.