బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 29, 2020 , 15:30:08

IPL 2020: డివిలియర్స్‌ మరో రికార్డు

 IPL 2020: డివిలియర్స్‌ మరో రికార్డు

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ అరుదైన  ఘనత సాధించాడు.  సోమవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో  బెంగళూరు గెలుపొందడంలో కీలకపాత్ర పోషించిన  డివిలియర్స్‌ (24 బంతుల్లో 55 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు)  మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా   నిలిచాడు.  ఈ క్రమంలోనే  ఐపీఎల్‌ చరిత్రలో 4,500 పరుగుల మైలురాయిని చేరుకున్న ఐదో బ్యాట్స్‌మన్‌గా ఏబీడీ రికార్డు సృష్టించాడు.

ఈ ఫీట్‌ అందుకున్న రెండో విదేశీ ప్లేయర్‌గా నిలిచాడు.  విదేశీ ఆటగాళ్లలో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌  ఒక్కడే ఇప్పటివరకు 4,500 రన్స్‌ చేశాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మ, డేవిడ్‌ వార్నర్‌, శిఖర్‌ ధావన్‌  చోటు దక్కించుకోగా తాజాగా డివిలియర్స్‌ చేరాడు. 

2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్‌ ఐపీఎల్‌ కెరీర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆరంభించాడు. ఆ తర్వాత బెంగళూరులో చేరిన డివిలియర్స్‌  చాలా ఏండ్ల నుంచి ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  కోహ్లీ, డివిలియర్స్‌   మధ్యనున్న అనుబంధం ఏంటో అంద‌రికీ తెలిసిందే.


logo