సోమవారం 13 జూలై 2020
Sports - May 12, 2020 , 14:57:02

ఆ పరిస్థితుల్లో సచిన్ కంటే కోహ్లీనే బెస్ట్​: ఏబీ

ఆ పరిస్థితుల్లో సచిన్ కంటే కోహ్లీనే బెస్ట్​: ఏబీ

న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్ని ఫార్మాట్లలో అత్యద్భుతమైన బ్యాట్స్​మన్ అని దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. అయితే తీవ్ర ఒత్తిడి ఉన్న లక్ష్యఛేదనలో సచిన్ కన్నా టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే అత్యుత్తమంగా ఆడతాడని అతడు అభిప్రాయపడ్డాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్​, కామెంటేటర్​ పామియో బంగ్వాతో ఇన్​స్టాగ్రామ్ లైవ్​ ద్వారా ఏబీ పలు విషయాలపై మాట్లాడాడు.

“నాకు, కోహ్లీకి సచిన్ రోల్​మోడల్​. మా లాంటి వారు అనుసరించేందుకు అతడు ఉన్నత ప్రమాణాలు నిర్దేశించాడు. సచిన్​ ఓ తరంలో సాధించిన విజయాలు అందరికి ఉదాహరణ లాంటిది. వ్యక్తిగతంగా నాకైతే.. నేను చూసిన వాళ్లతో అత్యుత్తమైన బ్యాట్స్​మన్ విరాట్ కోహ్లీనే. ప్రత్యర్థి 330 పరుగులు చేసినప్పుడు.. లక్ష్యాన్ని ఛేదించేందుకు నేను కోహ్లీనే ఎంచుకుంటా. సచిన్ అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన బ్యాట్స్​మన్​. అయితే లక్ష్యఛేదనలో తీవ్ర ఒత్తిడి ఉన్న సమయంలో విరాట్ కోహ్లీనే అత్యుత్తమం. ఒత్తిడి ఉన్న మ్యాచ్​ల్లో కోహ్లీ ఎన్నోసార్లు అద్భుతాలు చేశాడు” అని ఏబీ డివిలియర్స్ చెప్పాడు. ఐపీఎల్​లో కోహ్లీ, ఏబీ డివిలియర్స్.. రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు తరఫున సుదీర్ఘ కాలం నుంచి కలిసి ఆడుతున్నారు. 


logo