బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 13, 2020 , 16:12:36

IPL: క్రిస్‌గేల్‌ రికార్డు బ్రేక్‌ చేసిన డివిలియర్స్‌

IPL: క్రిస్‌గేల్‌ రికార్డు బ్రేక్‌ చేసిన డివిలియర్స్‌

దుబాయ్:  ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ అరుదైన ఘనత అందుకున్నాడు. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్‌(73 నాటౌట్:‌ 33 బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సర్లు) మెరుపులతో బెంగళూరు 194 పరుగులు సాధించింది.  సూపర్‌ ఫామ్‌లో ఉన్న డివిలియర్స్‌ తానెంత విధ్వంసకర ఆటగాడినో మరోసారి నిరూపించాడు.  బెంగళూరు 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఏబీడీ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. 

ఐపీఎల్‌ కెరీర్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అందుకోవడం అతనికిది 22వది కావడం విశేషం. ఈ క్రమంలోనే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ హార్డ్‌హిట్టర్‌ క్రిస్‌గేల్‌ పేరిట ఉన్న  అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుల రికార్డును ఏబీడీ బ్రేక్‌ చేశాడు.  ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధికసార్లు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్న బ్యాట్స్‌మన్‌గా ప్రస్తుతం డివిలియర్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. డివిలియర్స్‌ దూకుడుకు.. బౌలర్లు అండగా నిలువడంతో.. కోహ్లీ సేన లీగ్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. 

అత్యధిక అవార్డు విజేతలు వీరే..!

1. ఏబీ డివిలియర్స్‌ -22

2.క్రిస్‌ గేల్‌ -21

3.రోహిత్‌ శర్మ -18

4.డేవిడ్‌ వార్నర్-‌ 17

5.మహేంద్ర సింగ్‌ ధోనీ- 17

6.షేన్‌ వాట్సన్‌ -16