గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Jan 15, 2020 , 01:22:41

ఐదేండ్ల వయసులోనే.. గిన్నిస్‌ బుక్‌లోకి

ఐదేండ్ల వయసులోనే.. గిన్నిస్‌ బుక్‌లోకి
  • చరిత్ర సృష్టించిన తైక్వాండో ప్లేయర్‌ ఆష్మాన్‌ తనేజా

హైదరాబాద్‌: బుడిబుడి అడుగులు వేసుకుంటూ బడికి వెళ్లాల్సిన వయసులో ఐదేండ్ల బుడతడు తైక్వాండోలో గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు. హైదరాబాద్‌కు చెందిన ఆష్మాన్‌ తనేజా.. నిర్విరామంగా గంట పాటు మోకాలి స్ట్రయిక్స్‌ కొట్టిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఆష్మాన్‌ గంటలో 1200కు పైగా మోకాలి స్ట్రయిక్స్‌తో చరిత్ర సృష్టించాడు. చిన్నతనంలోనే అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఈ బుడ్డోడు.. గతంలో అమెరికా ప్రపంచ ఓపెన్‌ తైక్వాండోలోనూ రజత పతకంతో అదరగొట్టాడు. తాజాగా గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకొని మరోసారి శభాష్‌ అనిపించుకున్నాడు. దీనికోసం ఆష్మాన్‌ ఎంతో ప్రాక్టీస్‌ చేశాడని, త్వరలోనే మరో రికార్డు బ్రేక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని బాలుడి తండ్రి ఆశీష్‌ తనేజా చెప్పాడు.
logo