ఆదివారం 09 ఆగస్టు 2020
Sports - Jul 03, 2020 , 13:24:05

ఆరోన్‌ ఫించ్ వరల్డ్‌ రికార్డుపై ఐసీసీ ట్వీట్‌

ఆరోన్‌ ఫించ్  వరల్డ్‌ రికార్డుపై ఐసీసీ ట్వీట్‌

సిడ్నీ:  ఆస్ట్రేలియా  విధ్వంసకర ఓపెనర్   అరోన్‌ ఫించ్‌ సరికొత్త  ప్రపంచ రికార్డు నెలకొల్పింది నేడే.  2018 జూలై 3న టీ20ల్లో ప్రపంచ  రికార్డు బ్రేక్‌ చేశాడు హార్డ్‌హిట్టర్‌.   ముక్కోణపు టీ-20 సిరీస్‌లో భాగంగా   జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో  ఫించ్‌ (172; 76 బంతుల్లో 16×4, 10×6) పరుగులు సాధించాడు. దీంతో అంతర్జాతీయ టీ-20ల్లో అత్యధిక రన్స్‌ చేసి  ఆటగాడిగా నిలిచాడు.  తన పేరిటే ఉన్న 156 పరుగుల రికార్డును ఫించ్‌ బద్దలు కొట్టాడు. 

ఈ మ్యాచ్‌లో విశేషంగా రాణించిన  ఫించ్ కు 'మ్యాన్ ఆఫ్ ద  మ్యాచ్' అవార్డు లభించింది.  పొట్టి క్రికెట్లో  పరుగుల సునామీ సృష్టించిన ఫించ్‌ ఐసీసీ మెన్స్‌ టీ20 పర్‌ఫార్మెన్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు కూడా అందుకున్నాడు. 2018లో ఇదే రోజు ఫించ్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడని ఐసీసీ ఇవాళ ట్వీట్‌ చేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo