సోమవారం 18 జనవరి 2021
Sports - Nov 29, 2020 , 21:34:53

మూడో వన్డేకు వార్నర్‌ దూరం!

మూడో వన్డేకు వార్నర్‌ దూరం!

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ భారత్‌తో మూడో వన్డేకు దూరంకానున్నట్లు తెలిసింది.  భారత్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో వార్నర్‌ గాయపడ్డాడు.  భారత ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో శిఖర్‌ ధావన్‌ కొట్టిన బంతిని   ఆపే క్రమంలో గాయపడిన వార్నర్‌ నొప్పితో విలవిల్లాడాడు.   గజ్జల్లో గాయం కారణంగా అతడు నడవడానికి కూడా ఇబ్బందిపడ్డాడు. చివరకు ఫిజియో, మాక్స్‌వెల్‌ సాయంతో కుంటుతూనే మైదానాన్ని వీడాడు.  మెరుగైన వైద్య పరీక్షల కోసం అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.  

మ్యాచ్‌ అనంతరం ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ మాట్లాడుతూ.. వార్నర్‌ ఫిట్‌నెస్‌ గురించి ఇంకా ఏమీ తెలియలేదు. అతడు తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని నేనైతే అనుకోవట్లేదు. ఓపెనర్‌గా అతడు జట్టుకు మంచి శుభారంభాలు అందించాడని ఫించ్‌ పేర్కొన్నాడు. ఆఖరిదైన మూడో వన్డే బుధవారం కాన్‌బెర్రాలో జరగనుంది.