శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Sep 06, 2020 , 18:53:25

ENGvAUS:రెండో టీ20..ఆస్ట్రేలియా బ్యాటింగ్‌

ENGvAUS:రెండో టీ20..ఆస్ట్రేలియా బ్యాటింగ్‌

సౌతాంప్టన్‌: ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య మరో రసవత్తర పోరు ఆరంభమైంది. రెండో టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ ఈసారి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నాయి.  తొలి టీ20లో  ఇంగ్లాండ్‌ చేతిలో  కేవలం  2 పరుగుల తేడాతో ఓడిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో సజీవంగా ఉండాలని పట్టుదలతో ఉన్నది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ20లో విజయం సాధించి ఉత్సాహంగా ఉన్న ఇంగ్లీష్‌ జట్టు రెండో టీ20ని కైవసం చేసుకోవాలనుకుంటున్నది. 


logo