ఆదివారం 17 జనవరి 2021
Sports - Dec 18, 2020 , 00:14:31

అంతర్జాతీయ క్రికెట్‌కు ఆమిర్‌ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌కు ఆమిర్‌ గుడ్‌బై

కరాచీ: పాకిస్థాన్‌ పేసర్‌ మహమ్మద్‌ ఆమిర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు అకస్మాత్తుగా వీడ్కోలు పలికాడు. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) మేనేజ్‌మెంట్‌ తనను మానసికంగా వేధిస్తున్నదని గురువారం సంచలన ఆరోపణలు చేశాడు. స్పాట్‌ ఫిక్సింగ్‌లో చిక్కుకొని 2010 నుంచి ఐదేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్న ఆమిర్‌ తరఫున మళ్లీ బరిలోకి దిగాడు. అయితే ప్రస్తుత న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన పాక్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో కలత చెంది ఈ నిర్ణయానికి వచ్చాడు. పాకిస్థాన్‌ తరపున 36 టెస్టులు ఆడిన ఆమిర్‌ 119 వికెట్లు పడగొట్టాడు. 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు దక్కించుకున్నాడు.